స్కూటర్, కారు ఢీకొని వ్యక్తి మృతి


Mon,August 12, 2019 01:32 AM

నల్లగొండ క్రైం : స్కూటర్‌ను కారు ఢీకొని వ్యక్తి మృ తి చెందాడు. నల్లగొండ శివారులోని ఆర్జాలబావి సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. నల్లగొండ మం డలం మర్రిగూడ గ్రామానికి చెందిన మందడి ప్రసాద్‌రెడ్డి(32) వ్యక్తిగత పనులపై స్కూటర్ (యాక్టివా)పై నల్లగొండకు బయల్దేరాడు. ఆర్జాలబావి సమీపంలోకి రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి బైపాస్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌రెడ్డి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్లగొండ ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించా రు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...