ఇరువర్గాల ఘర్షణ


Mon,August 12, 2019 01:31 AM

కోదాడ రూరల్ : తీజ్ వేడుకల్లో డీజే విషయంలో ఇరువర్గాల మధ్య జరగిన ఘర్షణ ముగ్గురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగలితండాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు ఆదివారం డీజే వద్ద ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల దాడిలో బాణోత్ బాలాజీ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...