ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య


Mon,August 12, 2019 01:30 AM

నల్లగొండక్రైం : ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ మం డలం కుదావన్‌పూర్ గ్రా మంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిం ది. రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రా మానికి చెందిన ఎన్న జాన్‌రెడ్డి (32) తనకున్న ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సతమతమవుతూ తీవ్ర మనస్తాపంలో ఉన్నా డు. అప్పు ల బాధ భరించలేక శనివారం రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జాన్‌రెడ్డి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...