45రోజులు జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉంది..


Mon,August 12, 2019 01:30 AM

నల్లగొండక్రైం : జిల్లాలో శాంతిభద్రతలను సమర్ధవంతంగా పరిరక్షించడం, నేరాలను అదుపు చేయడం, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధులు నిర్వహించడం గర్వంగా ఉందని ఇన్‌చార్జి ఎస్పీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారిగా తనకు సొంతజిల్లాలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణకు వెళ్లేముందు ఎస్పీ రంగనాథ్ సమర్థవంతంగా ముందుకు సాగిన జిల్లాను అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లానన్నారు. ఈ 45రోజులపాటు విధుల్లో తనకు పూర్తిగా సహకరించిన అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీలు, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...