ఆయకట్టులో ఆనందం


Sun,August 11, 2019 12:58 AM

-కృష్ణానదికి పోటెత్తుతున్న వరద
-శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్ల ద్వారా నీటి విడుదల
-వారం రోజుల్లో పూర్తిగా నిండనున్న నాగార్జునసాగర్
-ఎడమకాల్వ పరిధిలో సాగునీటికి పచ్చజెండా
-జోరందుకోనున్న వరి సాగు పనులు
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : 2018వానాకాలం సీజన్‌లో నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఆగస్టు 22న నీటిని విడుదల చేశారు. నవంబరు 28వరకు ఆరు విడుతలుగా 40టీఎంసీల నీటిని ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో 99రోజులు విడుదల చేశారు. అప్పటికి సాగర్ నీటి మట్టం 555అడుగులు ఉండగా.. లక్ష క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో నమోదైంది. ఈ ఏడాది ప్రస్తుతం 525అడుగులకు చేరగా.. భారీగా వరదవస్తుండడంతో సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతోపాటు 5లక్షల 50వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీనికి తోడు కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండడంతో మరో 10రోజులకు పైగా వరద కొనసాగే అవకాశం ఉంది. దీంతో సాగర్ ప్రాజెక్టు మరో ఐదారు రోజుల్లోనే నిండటంతో పాటు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల
ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటిలాగా కాకుండా ప్రయోగాత్మకంగా 2016-17లో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు విడుదల చేసి సత్ఫలితాలు సాధించారు. ఈ పద్ధతిలో సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవడమే గాకుండా తెగుళ్లు, పురుగుమందుల వాడకం తగ్గి దిగువడి కూడా పెరిగింది. దీంతో ఎడమకాల్వ ఏటా ఇదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది.

స్పల్పకాలిక వరివంగడాలే మేలు
గతేడాది వానాకాలం సీజన్‌లో రైతులు స్వల్పకాలిక వరివంగడాలైన ఎంటియూ 1010, పూజ, హెచ్‌ఎంటీ, చింట్లు రకం నార్లు పోసుకుని అధిక దిగుబడులు సాధించారు. కాగా ఏ ఏడాది కూడా రైతులు స్వల్పకాలిక వరివంగడాలు నార్లు పోసుకుని పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...