త్యాగానికి ప్రతీక బక్రీద్


Sun,August 11, 2019 12:52 AM

నల్లగొండ కల్చరల్ : పవిత్ర బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోనున్నారు. త్యాగాలకు ప్రతీకగా ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. ఈరోజున ప్రతి ముస్లిం ఖుర్భానీ ఇవ్వటానికి ఆరాటపడుతుంటారు. ఇందుకు వారు పొటెళ్లు, గొర్రెలు, మేకలను ఖరీదుచేస్తారు. త్యాగానికి ప్రతికగా నిలిచే ఈ బక్రీద్ పండుగ కోసం పట్టణాలతోపాటు వివిధప్రాంతాల్లో నుంచి గొర్రెలు, మేకలు, పశులను నల్లగొండతోపాటు ప్రధానప్రాంతాలకు అమ్మకానికి తీసుకవచ్చి వ్యాపారులు విక్రయిస్తుంటారు. ప్రతి సంవత్సరం నల్లగొండ పట్టణంలోని ఎక్బాలు మీనార్, ఆర్పీ రోడ్డు, దేవరకొండ రోడ్డు, ప్రకాశం బజార్ తదితర ప్రాంతాలకు వ్యాపారులు గొర్రెలను తీసుకవచ్చి విక్రయిస్తుండటంతో ఆప్రాంతాలు పండుగ ముందురోజులు కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. కొంతమంది ముస్లింలు గ్రామీణప్రాంతాలకు వెళ్లి గొర్రెలను బక్రీద్ కోసం తీసుకొస్తుంటారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...