ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ


Sun,August 11, 2019 12:52 AM

నల్లగొండ కల్చరల్: ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించే బక్రీద్ పండుగ ఈ నెల 12న జరుగనుంది. ఇందులో భా గంగా సోమవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల కోసం నల్లగొండలోని మునుగోడ్ రోడ్డులోగల ఈద్గా వద్ద ఏర్పాట్లను శనివారం ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించే బందోబస్తుపై పోలీసు అధికా రులతో చర్చించారు. ప్రశాంతంగా పండు గను జరుపుకునేలా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పండుగ ప్రశాంతంగా జరుపుకునేలా అందరూ సహరించాలని కోరారు. అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట పీస్ కమిటీ సభ్యులు హఫీజ్‌ఖాన్, ముస్లిం మతపెద్దలు, పోలీసులు ఉన్నారు

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...