జాబ్‌మేళాలో 50 మంది ఎంపిక


Sun,August 11, 2019 12:52 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : పట్టణలోని దేవరకొండ ఒకేషనల్ జూనియర్ కళాశాల, సూర్యా పారామెడికల్ కళాశాలలో యూనివర్శల్ మెడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఒకేషనల్ కళాశాల కరస్పాండెంట్ కె మల్లికార్జున్ తెలిపారు. ఎంపిహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ, పారమెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారని, జాబ్ మేళాలో 50 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు యూనివర్శల్ మెడ్ సర్వీసెస్ అధ్యక్షులు స్నేహపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగార్జున, డైరెక్టర్ శ్రీశైలం ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...