ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం


Sun,August 11, 2019 12:51 AM

పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని వద్దిపట్ల గ్రామం శ్రీమదాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలను శనివారం ఆలయ ధర్మకర్త వూరె లక్ష్మీనర్సింహారావు, రాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో గణపతిపూజ, పుణ్యహవాచనం, మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణ నిర్వహించి నవగ్ర హ హోమం, పూర్ణహుతి, హారతి, దీపస్తంభ ప్రజ్వలన తదితర పూజా కా ర్యక్రమాలను నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కొత్త వెంకటేశ్వర్లు, యల్గపురి కృష్ణారావు, లకుమారపు ఉపేందర్, సుధీర్, చంద్రారెడ్డి, పూజారులు వింజమూరి రామకృష్ణశర్మ, డేరం కిషన్‌శర్మ, డేరం సతీష్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...