ఎడమ కాల్వ నీటి విడుదలపై ఎమ్మెల్యే భాస్కర్‌రావు హర్షం


Sun,August 11, 2019 12:51 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నీటి విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో రైతుల శ్రేయస్సు దృష్ట్యా ముందుస్తుగా సాగునీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సకాలంలో సాగునీరు అందించేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలకు రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...