ఈద్గాల వద్ద నీటి వసతి కల్పించాలని వినతి


Sat,August 10, 2019 01:38 AM

మిర్యాలగూడ టౌన్ : ఈ నెల 12న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గవ్యాప్తంగా ఈద్గాల వద్ద నీటి సదుపాయం కల్పించాలని తెలంగాణ ఉలేమా కౌన్సిల్ మిర్యాలగూడ బ్రాంచి ప్రతినిధి ముఫ్తీ ఎండీ ఉమర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రార్థనల కోసం ఈద్గాల వద్దకు వచ్చే ముస్లింల సౌకర్యార్థం నీటి వసతి కల్పించాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.









47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...