గిరిజనుల సంక్షేమానికి


Sat,August 10, 2019 01:37 AM

ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగారాభేరి గిరిజన విద్యార్థ్ది సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తండాలను పంచాయితీలుగా మార్చి గిరిజనులకు అధికారాన్ని కల్పించిన ఘటన సీఎం కేసీఆర్‌దేనన్నారు. గిరిజన తండాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్‌నాయక్, నందానాయక్, రమేష్‌నాయక్, స్వామినాయక్, సందీప్ తదితరులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...