ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు


Sat,August 10, 2019 01:37 AM

మిర్యాలగూడ టౌన్: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. కనకదుర్గామాత అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచే మహిళలు ఆలయాలకు బారులు దీరారు. పసుపు కుంకుమ గాజులు సమర్పించి పిల్లా పాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు.సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు చేపట్టారు. గాంధీనగర్ కనకదుర్గాదేవి ఆలయం, బోటింగ్ పార్క్ ఉమామహేశ్వరస్వామి ఆలయం, హౌసింగ్‌బోర్డు వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు జరిపారు. విద్యానగర్ పరిధిలోని మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీనగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.

అడవిదేవులపల్లి : మండలంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజలను మహిళలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు తెల్లవారుజామునుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కోటేశ్వరశర్మ, మహిళలు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...