కార్మికులంతా టీఆర్‌ఎస్‌కేవీ వైపే


Sat,August 10, 2019 01:36 AM

దేశాభివృద్ధి మోదీతో సాధ్యం : సైదులు
మిర్యాలగూడ అర్బన్ : దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ప్రధాని మోదీకే సాధ్యమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు సైదులు అన్నారు. పట్టణంలోని 3వ వార్డులోగల చైతన్య నగర్‌లో శుక్రవారం బీజేపీపట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధిని చూసి యువత అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు సత్యప్రసాద్, రాజిరెడ్డి, హన్మంతరెడ్డి, అశోక్‌రెడ్డి, బంటు గిరి, శ్రీనివాస్, నాగునాయక్, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...