వచ్చే ఏడాదిన్నరలోగా డిండి ఎత్తిపోతల పూర్తి


Sat,August 10, 2019 01:36 AM

డిండి : వచ్చే ఏడాదిన్నరలోగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి డిండి ప్రాజెక్టుకు నిరందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఎత్తేందుకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యలో డిండి నీటిపారుదల అతిథి గృహంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మా ట్లాడారు. పది రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ రానున్నట్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నదని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్) ద్వారా డిండి ప్రాజెక్టు నింపాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు మంత్రిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, ఉపసర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ వెంకటయ్య, రాఘవాచారి, పేర్వాలజంగారెడ్డి, మేకలకాశన్న, రవీందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, కలీం, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...