నాటిన ప్రతీ మొక్కనూ సంరక్షించాలి


Sat,August 10, 2019 01:35 AM

డిండి : ప్రతీ విద్యార్థి మొక్కలు నాటి వాటిని సంరంక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. శుక్రవారం డిండి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో వర్షాలు కురవక అనావష్టి ఏర్పడుతుందని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలాన్న ముందు చూపుతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నా రు. ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని కోరారు.

కార్యక్రమం లో తహసీల్దార్ బాలరాజు, ఎంపీడీఓ గిరిబాబు, జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, ఎంపీపీ మాధవరం సునీత జనార్ధన్‌రావు, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్ మేకలసాయమ్మకాశన్న, ఉపసర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీలు రాధిక, వెంకటయ్య, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్ నాయకలు రాఘవాచారి, గుర్రంరాములు, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రావు, నాగార్జున్‌రెడ్డి, భగవంతరావు, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రావు, చంద్రయ్య, మాధవ్‌గౌడ్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...