పండుగలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు


Mon,July 8, 2019 03:47 AM

- పలు వార్డుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, తక్కెళపల్లి రవీందర్‌రావు
శివాజీనగర్: నల్లగొండ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని 1, 40, 36, 34, 35, 30, 32, 33, 27 వార్డుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పెద్దఎత్తున పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి పట్టణంలో అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. పట్టణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. పలు వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తక్కెళపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ క్రియాశీలక, సాధారణ సభ్యత్వాలకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందని ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, చీర పంకజ్‌యాదవ్, నిరంజన్‌వలి, బొర్ర సుధాకర్, కటికం సత్తయ్యగౌడ్, అనీస్, పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు దుబ్బ అశోక్‌సుందర్, ఎడ్ల శ్రీనివాసయాదవ్, అభిమన్యు శ్రీనివాస్, మాదగోని నవీన్‌గౌడ్, గున్‌రెడ్డి రాదిక యుగందర్‌రెడ్డి, కొండూరి సత్యనారాయణ, పిల్లిరామరాజు, దొడ్డి రమేష్, మధుసూదన్‌రెడ్డి, వెంకన్న, వట్టిపల్లి శ్రీనివాస్, శివ, దుబ్బ విక్రమ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...