నేర విచారణ సమర్థవంతంగా నిర్వహించాలి


Sun,July 7, 2019 01:27 AM

నల్లగొండ క్రైం : పోలీస్ సిబ్బంది నేర విచారణను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు తీర్పులను పరిశీలిస్తూ నేరస్తులకు ఏ రకమైన శిక్షలు విధించాలనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెరిగే విధంగా చూడడంలో నేర విచారణ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కోర్టుల నుంచి వెలువడే తీర్పులను పరిశీలించడం ద్వారా మరింత సమర్థవంతంగా ముందుకుపోవడంతో ఉపకరిస్తాయని తెలిపారు. అనంతరం నేరస్తులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అనుసరించాల్సిన పద్దతులు, కోర్టులో పిటీషన్ వేయాలి అనే అంశాలపై శిక్షణ నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి ఎస్పీని ప్రాసిక్యూటర్లు సత్కరించారు. సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి, ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ వాణి, డీసీఆర్‌బీ సీఐ రవికుమార్, పీపీలు నరేందర్‌రావు, జవహర్‌బాబు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...