టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం


Sat,July 6, 2019 03:57 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం పట్టణంలోని 5వ వార్డులో పలువురికి ఆయన పార్టీ సభ్యత్వం అందజేసి మాట్లాడారు. అభివృద్ధ్ది, సంక్షేమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రైతులకు నిరంతర విద్యుత్, ప్రమాద బీ మా, పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. అదేవిధం గా సభావట్ తండాలో టీఆర్‌ఎస్ మండలా ధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సభ్య త్వ నమోదు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకొం డ ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు హన్మంతు వెంకటేష్‌గౌడ్, నాయకులు చీదెళ్ల గోపి, గెల్వయ్య, మధు పాల్గొన్నారు.

కొండమల్లేపల్లిలో..
కొండమల్లేపల్లి : మండలంలోని గుడితండా గ్రామం లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు నేనావత్ రాంబాబునాయక్ శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి పార్టీ సభ్యత్వం అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. సభ్యత్వ నమోదులో మండలాన్ని మొదటి స్థానంలో ఉం చాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పెండ్లిపాకుల ప్రాజె క్టు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నేనావత్ బాలూనాయక్, రమావత్ శంకర్‌నాయక్, బావోజీ, తండావాసులు పాల్గొన్నారు.

డిండిలో..
డిండి : మండలంలోని ఎర్రగుంటపల్లి, టి.గౌరా రం గ్రామాల్లో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజినేని వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పలువురికి పార్టీ సభ్యత్వం అందజేసి మాట్లాడారు. ఈ నెల 10లోపు సభ్యత్వ నమో దు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్ర నర్సింహ, సర్పంచ్ పేట రాధ, ఎంపీటీసీలు శ్రీలత, యాసాని రజిత, మల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, దొంతునేని భగవంతరావు, భాస్కర్‌రావు, పేర్వాల జంగారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పెద్దయ్య, వెంకటయ్య, వెంగళ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...