రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : గుత్తా


Tue,June 18, 2019 02:20 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే సీఎం కేసీఆర్ అహర్నిషలు పాటు పడుతున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏరువాక పూర్ణిమ నాడు ప్రత్యేకంగా పూజలు చేసి వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీ అన్నారు. రైతు మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రిక వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో రైతును రాజును చేయాలనే లక్ష్యంతో రైతు సంక్షేమంకోసం దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరానికి ఏటా రూ.10వేలు రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు.

రైతులు ఏ కారణం చేత మరణించినా ఆకుటుంబానికి రూ.5లక్షలు రైతుబీమా ద్వారా అందించి రైతు కు టుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు 33. 38 లక్షల మందికి రూ.3600 కోట్లు రైతుల అకౌంట్లలో జమచేశారని, మరో పది రోజుల్లో మిగిలిన రైతులకు జమచేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 35 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వానాకాలం రైతులకు కోసం 7 లక్షల 50 వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. జేడీఏ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సరిపడా సబ్సిడీ విత్తనాలు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లవకుమార్, ఆరీఫ్‌ఖాన్‌లు వ్యవసాయ సాగు, పంటల రక్షణపై పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ వెంకటరమణచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, మిర్యాలగూడ డివిజన్ వ్యవసాయశాఖ సహాయసంచాలకుడు పోరెడ్డి నాగమణి, ఆర్డీఓ జగన్నాథరావు, ఎంపీపీలు నూకళ సరళహనుమంతరెడ్డి, జానయ్య, జడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్గినేటర్ తిరుపతమ్మ, నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరిరెడ్డి ,సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...