గ్రీవెన్స్ వినతులను పరిష్కరించాలి


Tue,June 18, 2019 02:18 AM

రామగిరి : గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు, డీఆర్‌డీఏకు సంబంధించి పింఛన్ల మంజూరు, వైద్యాఆరోగ్య, సంక్షేమ శాఖల రుణాలపై వినతులు అందజేశారు. దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయా శాఖల అధికారులు అత్యంత ప్రాధాన్యం నిచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో రవీంద్రనాథ్, జిల్లా ఉపాది కల్పన అధికారి పద్మ, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...