విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథం అలవర్చుకోవాలి


Tue,June 18, 2019 02:17 AM

-నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
నిడమనూరు : విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథాన్ని అలవర్చుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మండల పరిధిలోని వేంపాడు గ్రామపరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సోమవారం ప్రారంభించారు. బాలికలు దేశ సంపదగా భావించి సీఎం కేసీఆర్ మహిళల విద్యాభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి బాలికా విద్యకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పేరేట్ విద్యనందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ప్లేటు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి నర్సింహ, తహసీల్ధార్ జి.దేశ్యానాయక్, ఎంపీపీలు బొల్లం జయమ్మ, అనురాధ, పేర్ల సుమతి, మంచుకొండ వెంకటేశ్వర్లు, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నూకల వెంకట్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ బి.ప్రభాకర్‌రావు, వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ సలీం, నాయకులు రవియాదవ్, డేవిడ్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...