సర్దుబాటుకు రంగం సిద్ధ్దం


Sun,June 16, 2019 02:49 AM

-జిల్లాలో 1,253 ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలు
-127పాఠశాలల్లో పిల్లలు నిల్‌
-అత్యధికంగా చందంపేట.. అత్యల్పంగా వేములపల్లి, తిరుమలగిరి
-పిల్లలు తక్కువున్న బడులు, ఉపాధ్యాయుల విలీనానికి చర్యలు.!
రామగిరి : జిల్లా వ్యాప్తంగా 31మండలాల్లో 1483ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 1,23,582మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య యేటా గణనీయంగా తగ్గుతోంది. జిల్లా వ్యాప్తంగా 127పాఠశాలల్లో సున్నా శాతం (జీరో ఎన్‌రోల్‌మెంట్‌) నమోదు కావడంతో ఆ పాఠశాలలు 2019-20 విద్యాసంవత్సరానికి మూతపడే అవకాశం ఉంది. బడి బాటలో పిల్లల నమోదు జరిగితే వీటి మనుగడ కొనసాగనుంది. లేకుంటే సమీప పాఠశాలల్లో విలీనం (సర్దుబాటు) చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ఈనెల 24తర్వాత అటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

127పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు...
జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 127పాఠశాలలో సున్నా అడ్మిషన్లు ఉన్నాయి. వీటిలో 126 ప్రాథమిక పాఠశాలలుండగా ఓ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు తమ పని తీరుతో విద్యార్థుల సంఖ్య పెంచితే అవి కొనసాగనుండటంతోపాటు ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల సహకారంతో ముం దుకు సాగాలని విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ బాధ్యత ఎంఈఓలకు అప్పగి స్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బడులను సర్దుబాటు చేస్తే సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తారు.

‘బడి బాట’ పైనే ఆధారం...
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య (ఎన్‌రోల్‌మెంట్‌) పెంచేందుకు ఈనెల 14నుంచి 19వరకు బడి బాటను నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్న పిల్లలతోపాటు నూతనంగా బడుల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలలు కొనసాగనున్నాయి. లేకుంటే సర్దుబాటు చేయనున్నారు. బడిబాటలో పిల్లల నమోదు వివరాలను డీఈఓల నుం చి సేకరించి ఈనెల 24న తర్వాత సర్దుబాట..? విలీనమా.? అనే విషయం స్పష్టం చేయనున్నారు.
రవాణా భత్యం చెల్లించే అవకాశం.!
ఒకటి నుంచి 10మంది పిల్లలున్న పాఠశాలను సర్దుబాటు చేస్తే అక్కడి నుంచి సమీపంలోని పాఠశాలలకు పిల్లలు వెళ్లేందుకు రవాణా భత్యం కల్పించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సైతం సర్దుబాటు చేయబడిన పాఠశాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

సున్నా అడ్మిషన్లున్న పాఠశాలలివే..
జిల్లాలోని 31మండలాల్లో 1,253ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటిలో అడవిదేవులపల్లి 2 , అనుముల (హాలియా) 1 చందంపేట 20, చండూరు 5, చింతపల్లి 3, చిట్యాల 3, దామరచర్ల 6, దేవరకొండ 4, గుండ్లపల్లి 6, గుర్రంపోడు 8, కనగల్‌ 3, కట్టంగూర్‌ 2, మాడ్గుపల్లి 3, మర్రిగూడ 4, మిర్యాగూడ 4, మునుగోడు 4, నల్లగొండ 2, నాంపల్లి 4, నార్కట్‌పల్లి 2, నేరడుగోమ్మ 16, పెద్దఅడిశర్లపల్లి 10, నిడమనూర్‌ 4, పెద్దవూర 4, శాలిగౌరారం -2, తిప్పర్తి 2, త్రిపురారం 3 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కాగా కేతేపల్లి, కొండమల్లేపల్లిల, నకిరేకల్‌, తిరుమలగిరిసాగర్‌, వేములపల్లి మండలాల్లో సున్నశాతం పిల్లలున్న పాఠశాలు ఒక్కటి కూడా లేకపోవడం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి ఫలితమేనని చెప్పాలి.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలా..
l సున్న శాతం పిల్లలున్న పాఠశాలలు - 127
l 1 నుంచి 10లోపు పిల్లలున్న పాఠశాలలు - 125 (పెద్దవూర మండలంలో 2యూపీఎస్‌లున్నాయి)
l 1నుంచి 20 మంది పిల్లలున్న పాఠశాలలు - 323 (పెద్దవూర మండలంలో 2యూపీఎస్‌లున్నాయి)
l 1నుంచి 30మంది పిల్లలున్న పాఠశాలలు - 591

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...