జిల్లాకు అదనంగా కొత్త గురుకులాలు


Sat,June 15, 2019 12:20 AM

- నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో ఆరు ఏర్పాటు
- ఈనెల 17న ప్రారంభానికి సన్నాహాలు
- ఆంగ్లమాధ్యమంతో 5,6,7 తరగతులు ప్రారంభం
- లబ్ధి పొందనున్న మరో 1440మంది విద్యార్థులు
- జిల్లాలో మొత్తం 14కు చేరిన గురుకులాలు
నీలగిరి: జిల్లాకు కొత్తగా మరో ఆరు గురుకులాలు వచ్చాయ్.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ ప్రభుత్వం మంజూరుచేసిన ఈ పాఠశాలలను ఈనెల 17వ తేదీన ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 8గురుకులాల్లో పేద విద్యార్థులు పౌష్టికాహారంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారు. కొత్త వాటిలో ఈ ఏడాది 5,6,7 తరగతులను ఆంగ్లమాధ్యమంలో ప్రారంభించి తరగతికి 80మంది చొప్పున పాఠశాలలో 240మందికి ప్రవేశం కల్పించనున్నారు. అంటే జిల్లావ్యాప్తంగా మరో 1440మందికి అవకాశం లభించనుంది. గత ఏప్రిల్ నెలలో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకే రిజర్వేషన్ల ప్రకారం ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. గురుకులాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బడుగు, బలహీన వర్గాల పిల్లలకు గుణాత్మక విద్యనందించడానికి మహాత్మ జ్యోతిరావుపూలే పేరిట నెలకొల్పిన బీసీ గురుకులాలు సత్ఫలితాలు ఇస్తుండడంతో వాటి స్ఫూర్తితో గురుకులాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం జిల్లాలో కొత్తగా ఆరు గురుకులాలను ప్రారంభించనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పన ఏర్పాటు చేయగా జిల్లాలో ఇప్పటికే ఉన్న 8 గురుకులాలతో కలిపి వాటిసంఖ్య 14కు చెరింది. జిల్లాకు నూతనంగా మంజూరైన నాలుగు బాలుర, రెండు బాలికల గురుకులాలు ఈనెల 17న ప్రారంభంకాన్నాయి. దేవరకొండ నియోజకవర్గం కొండబీమనపల్లిలో (బాలు రు), నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిడమనూరు మండలం వేంపాడ్‌లో(బాలికలు), నకిరేకల్ నియోజక వర్గం నార్కట్‌పల్లి మండలం ముత్యాలమ్మగూడెం (బాలురు), మునుగోడు(బాలురు), నల్లగొండ(బాలికలు) మిర్యాలగూడ(బాలురు)లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలో గురుకులాల సంఖ్య మొత్తం 14కు చేరింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు కార్పొరేట్‌స్థ్దాయి విద్య అందుతుంది. తమ పిల్లలు చదువుల కోసం ప్రభుత్వం కొత్త గురుకులాలలను ఏర్పాటు చేయడంపై విద్యార్థ్ధుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పేద విద్యార్థ్ధులకు మెరుగైన విద్య....
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యార్థులకు మంచి ఆహారంతోపాటు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుతున్నాయి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా రెండేళ్ల కితం ఈ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 5వ తరగతి నుం చి 9వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నా రు. ఒక్కో పాఠశాలల్లో 400 మంది చొప్పున విద్యను అభ్యసిస్తున్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాలల్లో మొదటగా 5,6,7 తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతి రెండు సెక్షన్ల చొప్పున విభజిం చి ప్రతీ సెక్షన్‌కు 40 మంది విద్యార్థ్ధులకు ప్రవేశం కల్పించారు. రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజనం, క్రీడలు, యోగా సాం స్కృతిక కార్యక్రమాలతోపాటు నాణ్యమెన విద్య అందుతుంది. ఫలితంగా జిల్లాలోని రెసిడెన్షియంల్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గురుకులాల్లో ఏటా నిర్వహిచే ప్రవేశ పరీక్ష కోసం భారీసంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ఏడాదిసైతం ఒక్కో సీటు కోసం 3 నుంచి నలుగురు విద్యార్థులు పోటీ పడినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు
ప్రతీ విద్యార్థికి బెడ్డింగ్ మెటీరియల్, పుస్తకాలు, రాత పుస్తకాలు, మూడు జతల ఏకరూప దుస్తులు, ట్రక్‌సూ ట్ అందజేస్తారు. మెనూతో పౌష్టికాహారం, కాస్మోటిక్ చార్జిలు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, ప్రయోగాలు, విద్యార్థులకు చదువుతో పా టు ఆటపాటలు, అనుబంధ కార్యక్రమాలను ఉచితం గా అందజేస్తారు.

మరో 1440 విద్యార్థులకు లబ్ధి...
కొత్తగా మంజూరైన బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరం 5,6,7 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించనున్నారు. తరగతికి 80మంది చొప్పున 240 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో జిల్లాలో 1440మంది విద్యార్థులకు లబ్ధి చేకురనుంది. ఈ విద్యాలయాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఏప్రిల్‌లో టీజీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు ఆయా రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక వేళ సీట్లు మిగిలితే రెండో విడుత కౌన్సెలింగ్ చేపట్టి పూర్తి చేయనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు...
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ప్రవేశపరీక్ష ద్వారా 5,6,7 తరగతుల్లో అడ్మిషన్ కల్పిస్తున్నారు.పాత బీసీ గురుకలాల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, వార్డెన్లకు కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపారు. వీరిస్థానంలో కొత్త వారిని నియమించుకున్నారు. ఈ పాఠశాలల్లో ఇటీవల కంట్రాక్టు విధానంలో పనిచేసిన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల్లో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. క్యాటరింగ్‌ను టెండర్ విధానంలో కేటాయించచగా సెక్యూరి టీ, స్వీపింగ్, శానిటేషన్, ఇతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్‌పై నియమించారు.

246
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles