ఫ్లోరోసిస్ విముక్తి కోసమే పరిశోధన


Sat,June 15, 2019 12:18 AM

నార్కట్‌పల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాలను జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) 35 మందితో కూడిన శాస్త్రవేత్తల బృందం రెండు రోజుల నుంచి పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి, బ్రాహ్మణవెల్లంల గ్రామాల్లో పర్యటించింది. ఇప్పటి వరకు ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ కోసం ఎన్నో పరిశోధనలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఈ నేపథ్యంలో బృందం ఫ్లోరోసిస్‌పై విభిన్న పరిశోధనలు జరుపుతుంది ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దక్షిణభారతదేశంలోని అన్ని రాష్ర్టాల్లోనుండి పరిశోధకులు ఇక్కడికి వచ్చారు. ఆయా గ్రామాల్లో ఫ్లోరోసిస్ బారిన పడిన ప్రజలను చూసి చలించిపోయారు. అత్యాధునిక పద్ధ్దతుల్లో పరీక్షలు జరిపి ఫ్లోరోసిస్ బాధితులకు ఉపశమనం కలిగించే విధంగా జీఎస్‌ఐ చర్యలు తీసుకుంటుందని శాస్త్రవేత్తల బృందం వివరించారు. అనంతరం మునుగోడు మండలంలో కూడా పరిశోధనలు జరిపారు. జీఎస్‌ఐ డైరెక్టర్ తారక్‌నాధ్‌పాల్ రాధన్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించేందుకు జీఎస్‌ఐ సంస్థ్ధ ప్రత్యేక పనులు చేస్తుందని వచ్చే ఐదేళ్లలో పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని వివరించారు. వీరి వెంట డాక్టర్ భార్గవ్, ఇతర శాస్త్రవేత్తలు ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...