చిట్యాల వాసి నర్సింహయాదవ్‌కు డాక్టరేట్


Sat,June 15, 2019 12:18 AM

చిట్యాల: చిట్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు, వట్టిమర్తి పంచాయతీ కార్యదర్శి ఉప్పునూతల నర్సింహయాదవ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డా క్టరేట్‌ను ప్రకటించింది. ఆర్కియాలజీ విభాగం లో ఉన్నత విద్యామండలి మాజీ వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం పర్యవేక్షణలో ఏ స్టడీ ఆఫ్ టూరి జం డెవలప్‌మెంట్ విత్ రెఫరెన్స్ టు బుద్ధ్దిస్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ రీజియన్ అనే అంశంపై పరిశోధన చేసి తీసిన్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా నర్సింహకు పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. నర్సింహ 15 సంవత్సరాలుగా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 2014లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ 1948-2014 పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా నర్సింహను ఓయూ ఉన్నతాధికారులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, ఆర్కియాలజీ హెడ్ ఎన్‌ఆర్.గిరిధర్, అధ్యాపక సిబ్బంది డాక్టర్ శివానంద్, ఇతర పరిశోధక విద్యార్థులు, చిట్యాలకు చెందిన పలువురు అభినందించారు. ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందుకోనున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...