యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌సేవ..!


Sat,June 15, 2019 12:18 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌సేవను కోలాహలంగా నిర్వహించారు. ఊంజల్‌సేవలో వేలాదిమంది మహిళాభక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త...తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేషపుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపం లో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉపప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతు సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...