సాగునీటి వనరులు, జలాశయాలగణన పూర్తి చేయాలి


Sat,June 15, 2019 12:17 AM

నీలగిరి : జిల్లాలో ఆరో చిన్నతరహా సాగునీటి వనరులు, జలాశయాల గణన-2017-18 పూర్తి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, మున్సిపల్‌కమిషనర్లు, ఆర్డీఓలకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని నీటి వనరుల గణన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా భూగర్భ జల వనరులు, కుంటలు, చెరువుల, ఎత్తిపోతల పథకాల గణన ద్వారా నీటి లభ్యత వివరాలు అంచనా వేసి అవసరాలను అధిగమించేందుకు దోహద పడుతుందన్నారు. నీటి వనరుల గణనలో భాగంగా బావులు, బోర్లు, కుంటలు, చెరువులు ఎత్తిపోతల పథకాలు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు ఎన్ని ఉన్నాయో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే కోసం వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అర్థగణాంక శాఖ సంయుక్త సంచాలకుడు దయానందం, జేసీ చంద్రశేఖర్, డీఆర్వో రవీంద్రనాథ్, సీపీఓ సురేందర్, అధికారులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...