పాలెం సరిహద్దు నిర్ణయించాలి


Sat,June 15, 2019 12:17 AM

నీలగిరి: అనుముల మండలం పాలెం, రామడుగు గ్రామాల్లోని ఇసుక రీచ్‌లలో గ్రామాల సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. అనుముల మండల పరిధిలోని గ్రామాల రైతులు ఇసుక రీచ్‌ల వల్ల బోర్లు ఎండిపోతున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కలెక్టర్ ఎస్పీ రంగనాథ్‌తో కలిసి శుక్రవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాల ప్రకారంగా నడుచుకోవాలని, అయితే రైతులకు ఇబ్బంది లేకుండా శాండ్‌టాక్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇం దుకు గాను గ్రామాల ఇసుక వాగు సరిహద్దు నిర్ణయించి రెవెన్యూ అధికారులు ఇసుక పరిమాణం లెక్కించాలని ఆదేశించారు. సమావేశంలో గనులు, భూగర్భశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...