ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి


Sat,June 15, 2019 12:17 AM

సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని సర్వేల్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాధర్‌రెడ్డి కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్ర మాన్ని శుక్ర వారం గ్రామంలో గ్రామ సర్పంచ్ కట్టెల భిక్షపతితో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు ఇంటిని తల్లిదండ్రులను మరిచిపోయే విధంగా ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్నభోజనంతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, నర్సింహ, నాగభూషణచారి, వనజ, పద్మలక్ష్మి, రామకృష్ణ, అబ్దుల్ రజాక్, అరుణ, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...