రాములమ్మకు మంత్రి జగదీష్‌రెడ్డి నివాళి


Sat,June 15, 2019 12:17 AM

సూర్యాపేట టౌన్ : టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు మాతృమూర్తి యలగందుల రాములమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వారి నివాసానికి చేరుకుని రాములమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సామా భరత్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడీ భిక్షం, భూక్యా సంజీవ్‌నాయక్, గోదల రంగారెడ్డి, డాక్టర్ రామ్మూర్తి, పోలెబోయిన నర్సయ్యయాదవ్, గండూరి ప్రకాష్, గుణగంటి రాములు, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, నేరెళ్ల మధుగౌడ్, నాతి సవిందర్, దేవత్ కిషన్‌నాయక్‌తోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...