యాదాద్రి నిర్వాసితులకు అన్నిసదుపాయాలు కల్పిస్తాం


Fri,June 14, 2019 03:45 AM

దామరచర్ల: మండలంలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ప్లాంటు కింద నష్టపోయిన నిర్వాసితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆర్డీఓ జగన్నాథరావు అన్నారు. యాదాద్రి కింద కోల్పోయిన కపూర్‌తండా, మోదుగులతండా గ్రామస్తులకు మండలంలోని శాంతినగర్ గ్రామ పంచాయతీ ఎదుట గురువారం లాటరీ ద్వారా నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. కాలనీలో ఇళ్లు కోల్పోయిన కపూర్‌తండాకు చెందిన 86కుటుంబాలకు 86 ప్లాట్లు, మోదుగుల తండాకు 87కుటుంబాలకు 200 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్‌ఎండ్‌ఆర్ కింద అందజేసిన ఇండ్ల స్థలాలతో పాటుగా పాఠశాల, కమ్యూనిటీహాల్, అంగన్‌వాడీ కేంద్రం, గుడి, గ్రామదేవతలకు రెండు ప్లాంటు కేటాయించామని, విద్యుత్, శ్మశానవాటిక, తాగునీటి వసతి కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ కిరణ్, డీఐ బాలాజీనాయక్, పీఏసీఎస్ అధ్యక్షుడు డీ నారాయణరెడ్డి, ఆంగోతు హాతీరాంనాయక్, ఈశ్వర్, హేమానాయక్, బాలశంకర్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...