విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి


Fri,June 14, 2019 03:43 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన పది విద్యార్థులకు కలెక్టర్ అభినందన
వారితో కలిసి సహపంక్తి భోజనం నీలగిరి : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో మెమెంటోలు బహూకరించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు కమ్యునికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు మెరుగు పరుచుకోవాలని సూచించారు. దీంతో పాటు క్రీడలు, సంగీతం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల్లో , తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగేలా బోధన చేయాలన్నారు. పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండులను అభినందించారు. ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించి విజయవంతం చేశారని పేర్కొన్నారు. అనంతరం పది శాతం జీపీఏ సాధించిన 87 మంది విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సరోజినీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...