రైతులకు ఊరట..


Thu,June 13, 2019 03:29 AM

- ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిధులు విడుదల వేగవంతం
- జిల్లాలో 235 కేంద్రాల ద్వారా రూ. 813 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
- ఇప్పటి వరకు రూ. 626 కోట్లు విడుదల
- మరో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో అందజేత
నల్లగొండ, నమస్తే తెలంగాణ:జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది గ్రామీణాభివృద్ధి శాఖ-సహకార శాఖల ఆధ్వర్యంలో 235 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.813కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 73,582 మంది రైతుల నుంచి 4,59,565 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే ఈ నిధులకు సంబంధించి ఇటీవల కాస్త జాప్యం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సివిల్ సప్లయ్ యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు నిధుల విడుదలలో వేగాన్ని పెంచింది. గడిచిన నాలుగైదు రోజుల్లో రూ.150కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టింది. మిగిలిన రూ.187 కోట్లు మరో 4, 5 రోజుల్లో చెల్లించేలా సివిల్ సప్లయ్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

బిల్లులు అందజేయడంలోనే జాప్యం...
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యం విషయంలో రైతులకు డబ్బుల చెల్లింపులో ఇటీవల కాస్త జాప్యమైంది. అయితే ఆయా ఐకేపీ, పీఏసీఎస్‌లకు సంబంధించినటువంటి సిబ్బంది కొనుగోళ్ల విషయంలో దృష్టి సారిస్తు బిల్లుల సమర్పణలో జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల విడుదలలో ఆలస్యమైనట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇటీవలకాలంలో ఆయా కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో ఇరుశాఖలకు సంబంధించిన సిబ్బంది బిల్లులను సమర్పించడంపైనే దృష్టి సారించింది. దీంతో బిల్లుల ఆధారంగా ఎప్పటికప్పుడు సివిల్ సప్లయ్ యంత్రాంగం డబ్బులను చెల్లిస్తోంది.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...