రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు


Thu,June 13, 2019 03:27 AM

- కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్
- ఎమ్మెల్యే కంచర్లతో కలిసి చర్లపల్లిలో సర్వీస్‌రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
నీలగిరి : రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. చర్లపల్లి వద్ద నామ్‌రోడ్డు బ్రిడ్జి వద్ద క్రాసింగ్‌ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కలెక్టర్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, అధికారులతో కలిసి ప్రమాదాలు జరిగే స్పాట్‌లు, సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీస్, రవాణాశాఖ, గ్రామస్తులతో కలిసి చర్లపల్లి బ్రిడ్జి కింద కిలోమీటర్ మేర నడిచి పరిశీలించారు. బ్రిడ్జికి ఇరువైపుల సర్వీస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణంతో భూములు, ఇళ్ల నిర్మాణాలు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.కోటి 90 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అనుమతి లభించిందని, నష్టపరిహారం చెల్లింపు చేయనున్నట్లు గ్రామస్తులకు వివరించారు. సర్వీస్‌రోడ్డు, అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, సీఐ బాషా, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...