బడికి వేళాయే..


Wed,June 12, 2019 01:56 AM

-నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
-ముస్తాబైన విద్యానిలయాలు.. మోగనున్న బడిగంట
-ఇప్పటికే బడులకు చేరిన పాఠ్యపుస్తకాలు
-14 నుంచి 19వరకు బడి బాట
రామగిరి: 2019-20 మరో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇక అన్ని పాఠశాలలు విద్యార్థులతో సందడిగా దర్శనమివ్వనున్నాయి. విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నారు.

పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ రెడీ...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, 2 జతల యూనిపామ్ సిద్ధం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1606 వివిధ యాజమాన్యాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 8,01,012 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా 7,32,860 పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. మిగిలిన పదిశాతం పుస్తకాలు త్వరలో పంపించనున్నారు. యూనిఫామ్స్ సైతం బడి ప్రారంభమైన తొలి రోజే ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. యూడైస్‌లో ఎన్‌రోల్ అయిన ప్రతి విద్యార్థికి ఇవి అందనున్నాయి. పండుగ వాతావరణంలో బడులను తెరిచి ఈ నెల 12,13న సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యంగా...
ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2019-20లో ప్రభుత్వ బడుల విశిష్టతను తెలిపేలా ఈ నెల 14 నుంచి 19 వరకు బడి బాట చేపడుతూ ఐదు రోజులు వివిధ కార్యక్రమా లు చేపట్టనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన డీఈఓ పర్యవేక్షణలో జరుగనున్నాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...