వామ్మో జూన్


Wed,June 12, 2019 01:55 AM

-అన్ని వర్గాల ప్రజల ఖర్చులు పెంచే మాసం
-మధ్యతరగతి కుటుంబాల్లో మరింత గుబులు
-అన్నదాతకు వ్యవసాయ పెట్టుబడుల మోత
-తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయంతో ఊరట
-ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్ల వాత
చండూరు, నమస్తే తెలంగాణ: జూన్ ప్రారంభమైంది. విద్యార్థ్ధుల తల్లిదండ్రులకు, రైతులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది ఈ మాసమే. మే ముగుస్తుందంటేనే వా మ్మో జూన్ అంటూ మధ్యతరగతి కుటుంబాల్లో గుబు లుపుడుతుంది. రైతన్నల గుండె గుబేల్‌మంటుంది. ఏ యేడుకాయేడు పెరుగుతున్న స్కూల్ ఫీజులు, విత్తనా లు, ఎరువుల ధరలతో బెంబెలేత్తుతున్నారు. ఈ మా సంలోనే వానాకాలం ప్రారంభంకావడం.. పాఠశాలలు తెరుచుకోవడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. అన్నదాతలు పెట్టుబడికోసం వడ్డి వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరుగడం ప్రారంభిస్తే నెలసరి జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చె సాధారణ ప్రజలు వారి బడ్జట్‌లో ఖర్చులను తగ్గించే పనిలో పడ్డారు. ముఖ్యంగా పాఠశాలల యాజయాన్యాలు, స్కూల్ ఫీజులు, నోట్ పుస్తకాలు, బస్‌చార్జిలు, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షులు, పుస్తకాల ధరలు అ మాంతం పెంచేశాయి. దీం తో విద్యార్థ్ధుల తల్లిదండ్రుపై అదునపు భారం పడుతోంది.

ఇక రైతులదీ అదే పరిస్థితి.. వానాకాలం పనులు ప్రారంభించాల్సిన సమయం కూడా జూనే సాగుకు అవసరమైన ఎరువులు విత్తనాలు వంటి వాటికోసం డబ్బులు సమకూర్చూకోవాలి. అయితే గతేడాది నుం చి తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కింద మొన్నటివరకు ఎకరానికి రూ.4 వేలు ఈ ఏడాది నుంచి ఎకరాకు 5 వేలు చెల్లిస్తుంది. దీంతో వారు అధిక వడ్డ్డీలకు అప్పులు తెచ్చే అవకాశం లేకుండా ఉపయోగపడుతున్నది. ఏడాదిలో మిగిలిన 11 నెలల మాటేలా ఉన్న జూన్‌లో మాత్రం నెలసరి ఆదాయానికి ఖర్చులకు పొంతనే ఉండదు. పెరుగుతున్న ధరలకు కుటుంబపోషనకు భారం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ప్రైవేటు చదువులు ఆర్థ్ధిక నష్టాలను, కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కొత్త విద్యాసంవత్సరం మొదలైందంటే తల్లిదండ్రులకు తమ పిల్లలను ఏ స్కూల్‌లో చేర్పించాలి అన్న బెంగ పట్టుకుంది. విద్యా వ్యాపారం కావడంతో సగటు జీవి బడ్జెట్ చిన్నాభిన్నమౌతుంది. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తపనతో తల్లిదండ్రులు ఇప్పటికే పుస్తకాలు, నోటుబుక్కులు, బ్యాగు ల కొనుగోలులో బిజీగా మారారు.

రైతులకు పెట్టుబడి సీజన్
వానాకాలన్ని రైతులు పెట్టుబడుల సీజన్‌గా భావిస్తారు. జూన్ మాసంలో ఎప్పుడు వర్షం పడితే అప్పుడే విత్తనాలు నాటేందుకు ముందస్తుగానే అన్నదాత సిద్ధ్దమవుతాడు. అయితే జూన్ మాసంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటివి సిద్ధ్దం చేసుకునేందుకు డబ్బులు అవసరపడుతాయి. యాసంగి సీజన్‌లో పంటల బాగా పండినప్పటికీ ప్రభుత్వ రంగ సం స్థలకు రైతులు పంటను అమ్మిన ఇంకా డబ్బలు చేతికి అందలేదు. దీంతో వానాకాలం సీజన్ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సింది కూడా జూన్ మాసమే అయితే గతంతో పోలిస్తే రైతు పెట్టుబడి పథకం వచ్చిన తర్వాత అప్పుల బాధతగ్గింది.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...