రైతుబంధు పెట్టుబడి రైతులకు అందించాలి


Tue,June 11, 2019 02:33 AM

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి
నీలగిరి: రైతుబంధు ద్వారా అందించే పెట్టుబడి సాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి అన్నారు. సోమవారం రైతుబంధు, 2021 జనాభా లెక్కల సమీకరణకు సంబంధించి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు సాయం అందించడానికి సీసీఎల్‌ఏ నుంచి డిజిటల్ సంతకం చేసిన పట్టాదారుల డేటా, పట్టాదారుల విస్తీర్ణం సేకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54.56 లక్షల పట్టాదారులకు సంబంధించి 140లక్షల ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ కుబేర్ ద్వారా పట్టాదారుల ఖాతాలకు నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ చంద్రశేఖర్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...