ప్రతి ఫిర్యాదు పట్ల స్పందించేలా చర్యలు తీసుకోవాలి


Tue,June 11, 2019 02:33 AM

-ఇన్‌చార్జి ఏఎస్పీ రమేష్
నల్లగొండక్రైం : పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి గ్రీవెన్స్‌డే ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై స్పందించి అందుకనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకుసాగుతున్నట్లు ఇన్‌చార్జి ఏఎస్పీ రమేష్ అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్లు చేసి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. భూతగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకనుగుణంగా నడుచుకుంటు బాధితులకు సత్వరన్యాయం జరిగేలా చూడాలని సూచించారు. గ్రీవెన్స్‌డేకు మొత్తం జిల్లానుంచి 24ఫిర్యాదులు స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...