జల సంరక్షణ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి


Sat,May 25, 2019 02:29 AM

దేవరకొండ, నమస్తే తెలంగాణ : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న జల సంరక్షణ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శేఖర్‌రెడ్డి సూచించారు. పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో శుక్రవారం జల సంరక్షణ- రైతులతో సమాలోచన అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్న సంకల్పంతో ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతులు పొలాల్లో వాలు కట్టలు, పాంపాండ్స్, గుట్టలపై కందకాలు వంటి పనులను చేపట్టి వృథా నీటిని ఒడిసిపట్టుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో తేమ పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా పోస్తాయన్నారు. సారవంతమైన మట్టి సైతం కొట్టుకుపోకుండా ఉండి పంటల దిగుబడి కూడా పెరుగుతుందని అన్నారు. వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను రైతులు భూ అభివృద్ధి పథకంలో చదును చేసుకొని పండ్ల తోటల పెంపకం, పందిరి కూరగాయల సాగు, ఎరువుల తొట్లు, పవువుల పాకలు, కోళ్ల ఫారాలు, చేపల పెంపకం వంటి పనులతో ఆర్థిక స్థితిగతులను మార్చుకోవాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపాధిహామీ పథకం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సమావేశంలో దేవరకొండ క్లస్టర్ ఏపీడీ చరణ్ గౌతమ్, సర్పంచ్ ఎద్దిరాల నగేష్, ఏపీఓ శ్రీనివాస్, లలిత, ఈసీ రాజు, సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...