ఐడియా అదుర్స్


Sat,May 25, 2019 02:29 AM

-రిక్షాకు బైక్ మోటారు బిగింపు
-లీటరు పెట్రోల్‌కు 45కి.మీ ప్రయాణం
శ్రమ తగ్గి..ఆదాయం పెరిగిందంటున్న రిక్షావాలా
సూర్యాపేటసిటీ : రిక్షాలకు ఆదరణ కోల్పోతున్న తరుణంలో దానికి మోటార్ బిగించి దూసుకుపోతున్నారు రిక్షావాలా. దీంతో వారికి శరీర శ్రమ తగ్గడమే కాకుండా ఆదా యం పెరిగింది. రోజు మొత్తం చెమట చిందిస్తే రూ. 200ల నుంచి 300ల వరకు సంపాదన కష్టంగా ఉండేది. అందులో బరువైన సిమెంట్, ఇటుకలు, బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి వేసుకొని పట్టణంలో ట్రాఫిక్ జామ్ తో పాటు రోడ్డు అటుపోట్ల మధ్య రిక్షా తొక్కడం నరకంగా ఉండేది. దీంతో వ్యాపారులు, వినియోగదారులు రిక్షాలను నిర్లక్ష్యం చేస్తూ టాటా ఆటోలు, ఇతర మోటార్ వాహనాలను కిరాయి ఎక్కువ అయినా సరే వినియోగించే పరిస్థితి. ఇప్పుడు రిక్షాలకు రూ. 27వేలతో టీవీఎస్ మోటార్ అమర్చడంతో రిక్షాను తొక్కనవసరం లేకపోవడంతో పాటు లీటర్ పెట్రోల్ పోస్తే రిక్షా సుమారు 40-45 కి.మీ ప్రయాణం చేయడంతో ఇటు రిక్షా తొక్కే వారికి శ్రమ తగ్గింది. అటు వ్యాపారులకు ఆర్థిక భారం తగ్గడంతో మోటార్ రిక్షాకు గిరాకీ పెరిగి రోజుకు రూ.800-1000 వరకు ఆదాయం వస్తుందని రిక్షా లాగేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్‌తో నడిచే రిక్షాలను చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు పట్టణంలో మోటా ర్ రిక్షాల సంఖ్య పెరగడం ఖాయమనిపిస్తుంది.
శ్రమ తగ్గింది
రిక్షాకు మోటార్ బిగించడంతో రూ. 25వేల ఖర్చు వచ్చింది. రిక్షాకు మోటార్ బిగించినప్పటి నుంచి శారీరక శ్రమ బాగా తగ్గిం ది. శ్రమతో పాటు ఆదాయం పెరిగింది. వ్యాపారస్తులు కూడా గిరాకీ చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది రిక్షాకు మోటార్ ఎలా బిగించారు. ఎక్కడ బిగించారని అడుగుతుంటే ఆనందంగా ఉంది.
- డి.మంగ్య, రిక్షా కార్మికుడు

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...