16ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌వే...


Thu,May 23, 2019 01:31 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : నేడు వెలువడనున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసి 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని రైతు సమ న్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో ఎంపీ సీట్లన్నింటిని టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలుచు కోబోతోందని జాతీయ సంస్థలు నిర్వహించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయని, గురువారం ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి చేపడు తున్న పథకాలు, కార్యక్రమాలే టీఆర్‌ఎస్ విజయానికి దోహదపడుతున్నాయని, ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా సర్వేలు సైతం ఇవే అంశాలను విశ్లేషించాయన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రజలు గుండెచప్పుడును ఢిల్లీలో విని పించగలుతారని ప్రజలు విశ్వ శిస్తున్నారని పేర్కొన్నారు.

ఎమ్మె ల్సీ ఎన్నికల్లో తేర చిన్నపరెడ్డి గెలుస్తాడని తెలిసి కూడా కాంగ్రెస్ అత్యాశతో పోటీకి దిగిందని అన్నారు. ఈనెల 27న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ అన్ని జడ్పీచైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి ఎన్నికల నిబంధనలు ఉన్నందున కొత్త పథకాలను అమలు చేయలేకపోయామని తెలిపారు. జూన్ నుంచి పెంచిన రూ.2వేల పింఛన్లు, రైతు బంధు సాయం, నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తా మని తెలిపారు. మంజూరైన పనులకు టెండర్లు పిలువ డంతో పాటు, టెండర్లు పూర్తైన పనులను త్వరితగతిన ప్రారంభం కానున్నాయన్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని, ఆ పనులు కూడా యథా విధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన ఆరోపణలపై గుత్తా మాట్లాడుతూ మతి స్థిమితం లేనివారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, నాయకులు రేటినేని ముత్యంరావు, యేలే యాదయ్య, ఉప్పల శ్రీను పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...