నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ పోటీలకు కలీమ్ ఎంపిక


Thu,May 23, 2019 01:31 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : నేషనల్ లెవల్ అండర్-17 బ్యాడ్మింటన్ పోటీలకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎస్‌కె. కలీమ్ ఎంపికైనట్లు జిల్లా బ్యాడ్మింటన్ కోచ్ రామకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించాడు. గత వారం విశాఖపట్టణంలో నిర్వహించిన కేంద్రీయ విద్యాలయాల స్కూల్ గేమ్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెలలో భువనేశ్వర్‌లో జరిగే కేవీ నేషనల్ మీట్‌లో కలీమ్ మన రాష్ట్రం తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా వారిలో కలీమ్ ఒకడని కోచ్ తెలిపారు. కలీమ్ మిర్యాలగూడలోని కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. కలీమ్‌ను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...