పోచంపల్లిలో బిట్స్ పిలానీ విద్యార్థుల అధ్యయనం


Thu,May 23, 2019 01:31 AM

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని 9గ్రామాల్లో హెల్ప్ ఏజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు బిట్స్ పిలానీలో చదువుతున్న 20మంది విద్యార్థుల బృందం బుధవారం పోచంపల్లిని సందర్శించారు. ముఖ్యంగా వృద్ధులపై కేస్ స్టడీ చేసేందుకు గోవా, రాజస్థాన్, హైదరాబాద్‌కు చెందిన 20మంది విద్యార్థులు మండలంలోని వంకమామిడి, ఇంద్రియాల, కనుముక్కుల, మోహర్‌నగర్, జిబ్లక్‌పల్లి, జూలూరు, ముక్తాపూర్, రేవణపల్లి, పోచంపల్లి గ్రామాల్లో హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వృద్ధుల గ్రూప్‌ల వివరాలు, ఆ గ్రూప్‌లకు వారు అందిస్తున్న తోడ్పాటుతోపాటు హెల్త్ క్యాంపులు, కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ కార్యక్రమాలతోపాటు పొదుపు గురించి వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు హెల్ప్ ఏజ్ ఇండియా అందిస్తున్న చేయూతతోపాటు వారికి ఇచ్చి నాటించిన మొక్కల వివరాలను, వాటి ఎదుగుదల పోషణపై వివరాలు సేకరించారు. హెల్ప్ ఏజ్ ఇండియాలో చేరక ముందు వృద్ధుల జీవన స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితి, సంఘంలో చేరిన తరువాత వచ్చిన మార్పుల గురించి తెలుసుకున్నారు. భవిష్యత్తులో బిట్స్ పిలానీ ద్వారా కూడా వృద్ధులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడ తమ కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ రాజేష్ తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...