సాగర్ నీటిమట్టం 510.70 అడుగులు


Thu,May 23, 2019 01:30 AM

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్ధ్యం 590 అడుగులకు గానూ 510.70 అడుగుల వద్ద 132.8618 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు నీటి విడుదల కొనసాగడం లేదు. నాగార్జునసాగర్ జలాశ యం నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 450 క్యూసెక్కు లు, డీటి గేట్సు(డైవర్షన్ టన్నల్) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 460 క్యూ సెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ డ్యాం ఎడమకాల్వ ద్వారా, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా, కుడికాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 807.70 అడుగుల వద్ద 32.9712 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...