స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


Sun,May 19, 2019 01:02 AM

నీలగిరి: నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు గుర్తింపు కార్డులు జారీ చేస్తారన్నారు. ఈ నెల 31న ఉమ్మడి జిల్లాలోని రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1086 మంది ఓటర్లు ఉన్నారని అందులో 811 మంది ఎంపీటీసీలు, 57 మంది జడ్పీపీటీసీలు, 208 మంది కౌన్సిలర్‌లు ఉన్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ గోదాంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్ వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...