జిల్లాలో 4.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు


Sun,May 19, 2019 01:02 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా గత నెల 1 నుంచి ఇప్పటి వరకు 235 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. పానగల్ శివారులోని పీఏసీఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 72511మంది రైతుల నుంచి కొన్నటువంటి ధాన్యం విలువలో ఇప్పటికే రూ.313కోట్లు వారి ఖాతాలో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. నిర్ణీత ప్రమాణాలతో ధాన్యం తీసుకురావాలని సూచించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...