అర్హులందరికీ సహకార రుణాలివ్వాలి : సీఈఓ


Sun,May 19, 2019 01:02 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : సహకార బ్యాంకులను రుణం కోసం ఆశ్రయించి అర్హుడైన ప్రతి రైతుకు తప్పనిసరిగా రుణాలను అందజేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ మదన్‌మోహన్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో ఆయా సహకార బ్రాంచ్‌ల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక రుణాల కింద ట్రాక్టర్లు, పరికరాల కొనుగోలుకు, హార్‌వేస్టర్లు, బర్రెలు, గొర్రెల పెంపకం, సెరీ కల్చర్‌లో భాగంగా పట్టుపురుగుల పెంపకం, ఫాలీహౌజ్‌ల నిర్మాణం, పందిరి కురగాయల పెంపకంతోపాటు కోళ్ల పరిశ్రమకు రుణాలు అందజేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయేతర రుణాల కింద విద్యా రుణాలు కావాలని ఆశ్రయించిన రైతు బిడ్డకు గరిష్ఠంగా రుణాలు అందజేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా విదేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్లినటువంటి 43మంది రైతు బిడ్డలకు మూడున్నర కోట్లు బ్యాంకు రుణాలు అందజేశామన్నారు. విదేశాల్లో ఉద్యోగాలతో స్థిరపడిన విద్యార్థుల తల్లిదండ్రులు సీఈవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్ గోలి శ్రీనివాస్, డీజీఎంలు కుర్వానాయక్, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...