కొనసాగిన శారీరక సామర్థ్య పరీక్షలు


Sun,May 19, 2019 01:02 AM

ఎంజీయూనివర్సిటీ : నల్లగొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న టీఎస్‌పీఈసెట్ శారీరక సామర్థ్య పరీక్షలు నాల్గొవ రోజు శనివారం హోరాహోరాగా కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షలకు తరలివస్తుండటంతో ఎంజీయూలో సందడి నెలకొంది. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తేనే సీటు వచ్చే అవకాశం ఉండడంతో ప్రతి విద్యార్ధి పాయింట్స్ సాధించేందుకు శ్రమిస్తున్నారు. టీఎస్‌పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.

183మంది విద్యార్థుల గైర్హాజరు....
టీఎస్‌పీఈసెట్ పరీక్షలకు శనివారం 603మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 420మంది హాజరుకాగా 183మంది గైర్హాజరైన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో బీపీఈడీకి 345మందికిగాను 230మంది హాజరుకాగా 115మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా యూజీ డీపీఈడీకి 258మందికిగాను 190మంది హాజరుకాగా 68మంది గైర్హాజరయ్యారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...