ధాన్యమంతా కొనేలా..


Sat,May 18, 2019 02:07 AM

- యాసంగి ధాన్యం 235 కేంద్రాల ద్వారా కొనుగోలు
- ఈ సీజన్‌లో ఉత్పత్తి అంచనా.. 5.87 లక్షల మెట్రిక్ టన్నులు
- ఇప్పటి వరకు 4.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
- ఇందుకు రూ. 799.46 కోట్లు వెచ్చించిన సివిల్ సప్లయ్
యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఈ సీజన్‌లో 90 వేల హెక్టార్లలో వరి సాగు కాగా.. 5.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సహకార, గ్రామీణాభివృద్ధి శాఖలు 235 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 4.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ ధాన్యం కొనుగోళ్లు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఆలస్యంగా సాగు చేసిన రైతుల కోసం మరో 25 కేంద్రాలుఅందుబాటులో ఉంచి పూర్తి ధాన్యాన్ని కొనేలా అధికారులు
చర్యలు తీసుకుంటున్నారు.

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ప్రతి సీజన్‌లో రైతు పం డించినటువంటి ధాన్యాన్ని జిల్లా అధికార యంత్రాం గం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్దతుధరను అందజేసి కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది సైతం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ-సహకార శాఖలు సంయుక్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా గత నెల నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 235 కేంద్రాల ద్వారా 4.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ నెల చివరి నాటికి మొత్తం ధాన్యాన్ని సేకరించే విధంగా చర్యలు చేపట్టింది. ఈ ధాన్యానికి ఇప్పటి వరకు రూ. 800 కోట్లు సివిల్ సప్లయ్ ద్వారా రైతాంగానికి చెల్లించారు.

4.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
సర్కార్ ఆదేశానుసారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ-సహకార శాఖలు సంయుక్తంగా గతనెల 1వ తేదీ నుం చి జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. జిల్లాలో యాసంగి సీజన్‌లో 70,144 హెక్టార్ల సాధారణ సాగుకు 90,349 హెక్టార్లలో వరి పైరు రైతాంగం సాగు చేసింది. అయితే ఆయా హెక్టార్లలో పండించిన పంట ఆధారంగా 5,87,269 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధ్ది శాఖ-సహకార శాఖలు సంయుక్తంగా 235 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల ద్వారా 4,51,682 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అం దుకు గాను రూ. 799.46 కోట్లు 72,511 మంది రైతులకు చెల్లించారు.


ఐకేపీ కేంద్రాల్లో ఎక్కువ కొనుగోళ్లు...
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 163 ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో ఇంకా 12 కేంద్రాలలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆయాకేంద్రాల ద్వారా 40,704 మంది రైతుల నుంచి 26,57,614 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.470.39 చెల్లించింది. అదేవిధంగా సహకార శాఖ యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు 72 పీఏసీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసి 31807 మంది రైతుల నుంచి రూ.329.07 విలువ కలిగిన 18,59, 206 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ధాన్యం విక్రయించినటువంటి రైతులకు ఏ గ్రేడ్ రకమైతే రూ. 17 70 సాధారణ రకమైతే రూ.1750 చొప్పున చెల్లించడంతోపాటు 48 గంటల్లో డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకున్నారు.
ప్రతీ గింజ కొనుగోలు చేసేలా చర్యలు....
యాసంగి సీజన్‌లో 5.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు ఇప్ప టివరకు ఆయా కేంద్రాల ద్వారా 4.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతనెల 1వ తేదీన ప్రారంభమైన కేంద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మూసి వేయగా ఇంకా సహకార శాఖ ఆధ్వర్యంలో 13, ఐకేపీల ఆధ్వర్యంలో 12...మొత్తంగా 25 సెంటర్ల లో ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త తేమశాతం ఉన్నప్పటి కి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటు మిల్లర్లను ఒప్పించారు. ఈనెల చివరి నాటికి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించే విధంగా ఆయా శాఖల యంత్రాం గం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...